అరేబియా సముద్రంలో భారత నౌకాదళం భారీ మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది. నిఘా వర్గాల సమాచారం మేరకు భారత, శ్రీలంక నౌకాదళాలు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో సుమారు 500 కిలోల డ్రగ్స్‌ను పట్టుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. క్రిస్టల్ మెత్‌ను తరలిస్తున్న రెండు పడవలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ రూ.కోట్లలో ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా 9 మందిని అదుపులోకి తీసుకున్నారు.