ప్రతి వారం నిర్విరామంగా అన్నదానం చేయడం అభినందనీయమని బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ అన్నారు. జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతివారం చేస్తున్న అన్నదానం గురువారం 300వ సారికి చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ఆర్డీవో ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. వంట మాస్టర్ నిచ్చకోల గురుస్వామిని ఆయన శాలువాతో ఘనంగా సత్కరించారు.