బెల్లంపల్లి పట్టణంలోని రైల్వేస్టేషన్ ఏరియాలో మురళి మెమోరియల్ క్రికెట్ అకాడమీని శుక్రవారం ప్రారంభించనున్నారు. సబ్ జూనియర్ స్థాయి నుంచి సీనియర్ స్థాయి వరకు అకాడమీలో శిక్షణ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు నిర్వాహకులు పూర్తి చేశారు. నిపుణులైన శిక్షకులతో ఔత్సాహిక క్రీడాకారులకు మంచి శిక్షణ ఇచ్చి ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలంగాణ క్రికెట అసోసియేషన్ బాధ్యులు తెలిపారు.