దీపావళి పండుగ సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని ప్రజలందరికీ బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ గురువారం శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పట్టణంలోని బజార్ ఏరియాలోని వ్యాపారస్తులను ప్రజలను కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.