నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ స్టేడియంలో గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు మద్దెల శ్రీనివాస్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమరయోధుల పోరాట ఫలం అమరవీరుల త్యాగాలపై తిరుగులేని విజయం మన స్వతంత్ర దినోత్సవమని పేర్కొన్నారు.