బెల్లంపల్లి మున్సిపాలిటీ 21 వ వార్డు పరిధిలోని బూడిదగడ్డ బస్తీలో జామా మసీద్ ముందు రోడ్డు అంత అద్వానంగా తయారైంది. రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. మున్సిపల్ చైర్ పర్సన్, కమిషనర్ వెంటనే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని స్థానిక ప్రజలు మంగళవారం డిమాండ్ చేస్తున్నారు.