జనహిత సేవ సమితి ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని రూరల్ బస్టాండ్ వద్ద బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దాత విక్రం ధనరాజ్ సహకారంతో నిరుపేదలు, యాచకులు, బాటసారులు, చిరు వ్యాపారులకు భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో జనహిత సేవాసమితి అధ్యక్షుడు సతీష్, సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.