బెల్లంపల్లి పట్టణంలో నిర్మాణం చేపట్టిన సమీకృత కూరగాయల మార్కెట్ గదుల డిపాజిట్ రుసుం చెల్లించే గడువును మరికొద్ది రోజులు పొడిగించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. డిపాజిట్ చెల్లించేందుకు మరికొంత గడువు కావాలని కొందరు వ్యాపారస్తులు కోరుతున్నారని, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి గడువు పొడిగించేందుకు కృషి చేస్తామన్నారు.