వంట గ్యాస్ సబ్సిడీ మంజూరు పత్రాలు అందజేత

74చూసినవారు
వంట గ్యాస్ సబ్సిడీ మంజూరు పత్రాలు అందజేత
నెన్నెల మండలం ఘనపూర్ గ్రామంలో మహాలక్ష్మి పథకంలో భాగంగా అభయహస్తం వంట గ్యాస్ సబ్సిడీ మంజూరు పత్రాలను గొల్లపల్లి మాజీ ఎంపిటిసి బొమ్మెన హరీష్ గౌడ్ లబ్ధిదారులకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని మరోసారి రుజువైందన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 6 గ్యారంటీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్