మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కన్నాల ఫ్లైఓవర్ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో కాగజ్ నగర్ కు చెందిన బాణేష్ అనే వ్యక్తి డివైడర్ కు బలంగా ఢీకొని తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.