బెల్లంపల్లి నియోజకవర్గంలోని రోడ్లకు సంబంధించిన నిర్మాణ పనులపై పంచాయతీరాజ్ శాఖ డిఈ, ఈఈ అధికారులతో ఎమ్మెల్యే గడ్డం వినోద్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలోని గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం లో ఇబ్బందులు కలగకుండా కృషి చేస్తున్నామన్నారు. త్వరలోనే ప్రజల ప్రయాణ కష్టాలు తీరనున్నాయని పేర్కొన్నారు.