బెల్లంపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే గడ్డం వినోద్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటశాల, స్టోర్ రూమ్ ను దగ్గరుండి పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీధర్, ఉపాధ్యాయులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.