సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కి మెమోరాండం అందజేత

371చూసినవారు
సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కి మెమోరాండం అందజేత
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో శుక్రవారం జిఓ నెంబర్ 60 లో పేర్కొన్న వేతనాలను కేటగిరీల వారీగా పెంచి 2021 జూన్ నెల నుంచే అమలు చేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ కి మెమోరాండంని నాయకులు అందచేశారు. జీవో నెంబర్ 60 లో పేర్కొన్న వేతనాలు కాకుండా డా. బి ఆర్ సి చైర్మన్ సిఫారసు చేసిన వేతనాలను మాకు అమలు చేసేందుకు జిఓ నెంబర్ 60ని సవరించాలని, జీవోను సవరించే లోపు జిఓ 60 లో పేర్కొన్న వేతనాలను కేటగిరీల వారీగా చెల్లించాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మున్సిపల్, గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాలు పెంచి. పిఆర్సి తరహాలో నిర్ణయాత్మకమైన ఉద్యోగ భద్రత కు చర్యలు తీసుకుంటామని ప్రకటించిన నిర్ణయం పట్ల యూనియన్ హర్షం వ్యక్తం చేస్తున్నదని, ముఖ్యమంత్రి చేసిన నిర్ణయాన్ని అమలులోకి తీసుకువచ్చేందుకు వెంటనే జీవోలు జారీ చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అబ్బో జు రమణ, జిల్లా అధ్యక్షులు. ఎస్. కె యాకుబ్, జిల్లా కార్యదర్శి గొడిసెల చంద్ర మొగిలి, పట్టణ కార్యదర్శి పర్ల పల్లి సుమన్, ఈర్ల రాజ మొగిలి, బోళ్ల లక్ష్మీనారాయణ, రాచకొండ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్