బెల్లంపల్లి సింగరేణి ఏరియా గోలేటిలోని సింగరేణి సూపర్ బజార్ కార్మికుల సౌకర్యార్థం పునర్ ప్రారంభించాలని గుర్తింపు ఏఐటియుసి సంఘం నాయకులు కోరుతూ సూపర్ బజార్ ఎండి విలాస్ కు వినతిపత్రం అందజేశారు. గోలేటి బ్రాంచ్ కార్యదర్శి తిరుపతి మాట్లాడుతూ.. సింగరేణి సూపర్ బజార్ లో నాణ్యమైన సరుకులు సరసమైన ధరలలో అందుబాటులో ఉంటాయన్నారు. కార్మికుల సౌకర్యార్థం సూపర్ బజార్లు అందుబాటులోకి తేవాలన్నారు.