ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

78చూసినవారు
ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
కన్నెపల్లి మండల కేంద్రంలోని జిల్లా ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ప్రధాన ఉపాధ్యాయులు సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆయన జీవిత చరిత్రని ఉన్నతమైన విలువలని విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థులు ఉపాధ్యాయులకు తాము స్వయంగా తయారు చేసిన పుష్పగుచ్చాలు ఇచ్చి శాలువాలతో సత్కరించారు. విద్యార్థులందరూ తమ తమ ఉపన్యాసాలను తెలియజేశారు.

సంబంధిత పోస్ట్