యువకుడిని కాపాడిన రైటర్ సేఫ్ గార్డ్ ఎటిఎం సిబ్బంది..

1376చూసినవారు
యువకుడిని కాపాడిన రైటర్ సేఫ్ గార్డ్ ఎటిఎం సిబ్బంది..
మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రేపల్లెవాడ సమీపంలో జాతీయ రహదారిపై సమీపంలో పైపుల ఫ్యాక్టరీ లో పని చేస్తున్న యువకుడిని బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. పని పూర్తి చేసుకుని వస్తున్న రైటర్ సేఫ్ గార్డ్ ఎటిఎం సిబ్బంది అతడిని గమనించి వెంటనే పోలీసులకు మరియు 108 సిబ్బందికి సమాచారం అందించారు. గాయాలతో ఉన్న బాధితుడిని వెంటనే వారు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్పందించిన వారిలో రైటర్ సేఫ్ గార్డ్ ఎటిఎం సిబ్బంది పాషా, హేమ కార్తీక్, దేవేందర్, రవి ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్