భీమారం సమీపంలోని గొల్లవాగు ప్రాజెక్టు వద్ద ప్రభుత్వ స్థలంలో మట్టి తీసి అక్రమంగా తరలిస్తున్న జెసిబి తో పాటు మూడు ట్రాక్టర్లను ఇరిగేషన్ శాఖ అధికారులు పట్టుకున్నారు. జెసిబి యజమాని వీరేశం, ఆపరేషన్ సతీష్, ట్రాక్టర్ యజమానులు స్వామి, నరేష్, మధుకర్, డ్రైవర్లు గణేష్, మహేష్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాములు తెలిపారు.