చెన్నూర్ పట్టణం బట్టి గూడెం కాలనీకి చెందిన పందుల రమేష్ పెద్ద చెరువులో తామర పూల కోసం వెళ్లి అందులో పడి మృతి చెందాడు. చెరువు అడుగు బాగానే ఉన్నా తీగల వేరు నుంచి పూలను తొలగించే క్రమంలో అందులో చిక్కుకొని మంగళవారం అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు గమనించి వెలికి తీయగా అప్పటికే మృతి చెందాడు. రమేష్ కు భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. రమేష్ మృతితో భట్టి గూడెం కాలనీలో విషాదం నెలకొంది.