శ్రీరాంపూర్, మందమర్రి ఏరియాల్లో గత వారం రోజులుగా ఇద్దరు కార్మికులు యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగా మృతి చెందారని సిపిఎం నాయకులు ఆరోపించారు. వారు మాట్లాడుతూ తమ తప్పిదాలను తప్పించుకోవడానికి యాజమాన్యం గని మరణాలుగా గుర్తించకపోగా మృతి చెందిన కార్మికుడికి వారి కుటుంబ సభ్యులకు అన్యాయం చేసే విధంగా వివరిస్తుందని విమర్శించారు. బొగ్గు ఉత్పత్తిలో కీలకంగా పనిచేస్తున్న కార్మికుల ప్రాణాలు అంటే యాజమాన్యానికి లెక్క లేదన్నారు.