బానిస సంకెళ్ల నుండి విముక్తి కలిగిన చరిత్రాత్మకమైన రోజు

74చూసినవారు
బానిస సంకెళ్ల నుండి విముక్తి కలిగిన చరిత్రాత్మకమైన రోజు
మంచిర్యాల పట్టణంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక 10వ వార్డ్ శ్రీనివాస కాలనీలో రిటైర్డ్ ఆర్మీ అక్కేలకిరణ్ త్రివర్ణ పథాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బానిస సంకెళ్ళ నుంచి విముక్తి కలిగిన రోజు, ఎంతో మంది త్యాగాలు చేసి స్వాతంత్రం తీసుకు వచ్చారని, వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొత్తపెళ్లి రమేష్, అంజయ్య, సిద్ధం బాపు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్