వినాయక నిమజ్జనానికి ముమ్మరంగా ఏర్పాట్లు

73చూసినవారు
వినాయక నిమజ్జనానికి ముమ్మరంగా ఏర్పాట్లు
జన్నారం పట్టణంలో వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. పట్టణంలో సోమవారం వినాయక విగ్రహాలని నిమజ్జన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జన్నారం పట్టణ శివారులోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న వాగు వద్ద నిమజ్జనం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. పొన్కల్ పంచాయతీ ఈవో రాహుల్ ఆధ్వర్యంలో వాగు వద్ద ట్రాక్టర్ బ్లేడ్ల సహాయంతో రోడ్డును చదును చేయిస్తున్నారు.

సంబంధిత పోస్ట్