తెలంగాణ జన సమితి కార్యాలయంలో సంబరాలు

53చూసినవారు
తెలంగాణ జన సమితి కార్యాలయంలో సంబరాలు
తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ బి. బాబన్న మాట్లాడుతూ విద్య, సామాజిక న్యాయం, ప్రజా సమస్యల పరిష్కారానికి కోదండరాం ప్రధాన పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్