దసరా పండుగకు బంధువుల ఇంటికి వెళ్తున్నారా, అయితే పోలీసుల సూచనలు పాటించాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ కొన్ని సూచనలను విడుదల చేశారు. సోషల్ మీడియాలో మీ లొకేషన్, ట్రావెల్స్ ప్లాన్స్, ఎప్పుడు, ఎక్కడికి వెళ్తున్నామనే మీ అప్డేట్స్ పెట్టవద్దన్నారు. స్వీయ రక్షణకు ఇంట్లో సీసీ కెమెరా అమర్చుకుని, 1000 రూపాయల సిసి కెమెరా లక్షల విలువ చేసే ఆస్తులను కాపాడుతుందని వెల్లడించారు.