జన్నారం మండల ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో గురువారం కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సంఘం ఆధ్వర్యంలో ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు చంద్రమౌళి మాట్లాడుతూ కృష్ణ స్వామి స్వతంత్ర సమరయోధులు, ముదిరాజ్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా, హైదరాబాద్ మొట్టమొదటి మేయర్ గా పని చేసిన నాయకుడని కొనియాడారు.