నిరంతర శ్రమతో కృషి చేస్తే లక్ష్యాన్ని సాధించవచ్చని జన్నారం మండలంలోని రేండ్లగూడ గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ నాయక్ గురువారం అన్నారు. ఆ గ్రామానికి చెందిన మామిడిపల్లి రమన్ ఇటీవల నిర్వహించిన గ్రూప్ 4లో ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. దీంతో ఆయనను గ్రామపంచాయతీ తరఫున శాలువా కప్పి సన్మానించారు. ప్రతి ఒక్కరూ జీవిత లక్ష్యాన్ని సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.