రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను అవమానించే విధంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడడం సరికాదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మాట్లాడారు అమిత్ షా చేసిన వాఖ్యలు యావత్ దళితులను కించపరిచేలా ఉన్నాయని పేర్కొన్నారు. 20% దళితులకు హక్కులు అందడం లేదని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బిజెపి కుట్ర చేస్తుందని మండిపడ్డారు.