మంచిర్యాల: పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

73చూసినవారు
మంచిర్యాల: పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రేరణ డిగ్రీ కళాశాలలో 2008- 2011లో చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సోమవారం జరిగింది. స్థానిక ఒక ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులతో పాటు అధ్యాపకులు హాజరయ్యారు. అందరూ ఒక్క చోటుకు చేరి ఉత్సాహంగా గత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్