జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ టియు డబ్ల్యూ జే యూ 143 రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ తెలిపారు. ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆ యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయించడానికి ఉద్యమాలు రూపొందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.