మంచిర్యాల: గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్టు

65చూసినవారు
మంచిర్యాల: గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్టు
గంజాయి అమ్ముతున్న మంచిర్యాల హమాలివాడకు చెందిన షేక్ హుస్సేన్ ను అరెస్టు చేసినట్లు సోమవారం మంచిర్యాల ఎక్సైజ్ సీఐ గురవయ్య తెలిపారు. హమాలివాడ ఏరియాలో గంజాయి అమ్ముతున్నాడన్న సమాచారం మేరకు విజయనగర్ కాలనీ వద్ద షేక్ హుస్సేన్ ను పట్టుకొని తనిఖీ చేశారు. అతని వద్ద 115 గ్రాముల ఎండు గంజాయి గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్