మేడేను విజయవంతం చేయాలి

65చూసినవారు
మేడేను విజయవంతం చేయాలి
ప్రపంచ కార్మిక దినోత్సవం 138వ మేడేను విజయవంతం చేయాలని ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు పిలుపునిచ్చారు. శనివారం మంచిర్యాల పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మేడే పోస్టర్ ను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ పదేళ్ల పాలనలో ప్రధాని మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడాలని కోరారు.

సంబంధిత పోస్ట్