మంచిర్యాలలో నేటి నుంచి రెండు రోజులపాటు స్పాట్ అడ్మిషన్లు

57చూసినవారు
మంచిర్యాలలో నేటి నుంచి రెండు రోజులపాటు స్పాట్ అడ్మిషన్లు
మంచిర్యాల పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో గురు, శుక్ర వారాల్లో వివిధ కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయనున్నట్లు ప్రిన్సిపల్ పాండురంగ శర్మ తెలిపారు. (బీఎస్సీ ఎంపీసీ, ఎంఎస్, డిఎస్, ఎంజెడ్పి, బీజేడ్సీ), బీకాం (జనరల్) బీఎ (హెచ్ ఈ పి) కోర్సుల్లో ఖాళీ సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు కళాశాలలో సంప్రదించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్