మంచిర్యాల జిల్లా స్థాయిలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు వివిధ అంశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి కళోత్సవ పోటీలలో సబ్బేపల్లి విద్యార్థులు ప్రతిభ కనబర్చి మొత్తం నాలుగు అంశాలలో బహుమతులు సాధించడం జరిగింది. ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్ విభాగంలో అద్భుతంగా బ్యాండ్ వాయించి జిల్లా స్థాయిలో ప్రధమ స్థానం సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం జరిగింది. అలాగే మోనో డ్రామా, డ్యాన్స్, మరియు ట్రెడిషనల్ స్టోరీ విభాగాలలో బహుమతులు సాధించడం జరిగింది.