మంచిర్యాల జిల్లా లక్షేటీపేట్ మున్సిపల్ పరిధిలో మోదెల ఆరో వార్డులో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వార్డు అధ్యక్షులు మూల కిషన్ గౌడ్ మువ్వన్నెల జెండా ను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మూల లచ్చన్న గౌడ్, దమ్మ నారాయణ, తోట తిరుపతి బాకం లచ్చన్న, మూల సత్తన్న గౌడ్, తోట చంద్రశేఖర్, కోడి శ్రీనివాస్, డిష్ మల్లేష్, నగునూరి రవి, మగ్గిడి శోభన్, తోట వినోద్ తదితరులు పాల్గొన్నారు.