మందమర్రి: చికిత్స పొందుతూ కార్మికుడు మృతి
రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి కుర్మపల్లి ఫ్లై ఓవర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగుల సంతోష్ (24) మృతి చెందాడు. బైక్ పై ఫ్లైఓవర్ పై వెళ్తుండగా ముందు వెళ్తున్న మరో వాహనాన్ని సంతోష్ ఢీకొట్టాడు. దీంతో సంతోష్ తలకు తీవ్ర గాయమైంది. వైద్యం కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.