బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో మందమర్రి పట్టణంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో మున్సిపాలిటీ చర్యలు చేపట్టింది. ఈ మేరకు శనివారం 2వ వార్దులోని రామాలయం గుడి వద్ద పనిచేయని ఐమాక్స్ లైట్స్ ను పునరుద్ధరించి వినియోగంలోకి తీసుకొచ్చారు. మున్సిపల్ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించడం పట్ల వార్డు ఇంచార్జీ రాజేష్ కృతజ్ఞతలు తెలిపారు.