మందమర్రి: రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థిని
మందమర్రిలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే పాఠశాలలో చదువుతున్న మాసు అక్షర శుక్రవారం రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైంది. ఇటీవల జరిగిన జిల్లాస్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన అక్షర ఈ నెల 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననుంది. ఈ సందర్భంగా చదువుతో పాటు ఆటల్లో రాణిస్తున్న అక్షరను పాఠశాల ప్రిన్సిపల్ మంజుల, పీడీ విశాల, పీఈటీ స్వరూప అభినందించారు.