నిగంబోధ్ ఘాట్లో శనివారం సైనిక లాంఛనాలతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరిగిన విషయం తెలిసిందే. ఇవాళ ఆయన అస్థికలను ఢిల్లీలోని గురుద్వారా మజ్ను కా తిలా సాహిబ్ సమీపంలోని యమునా ఘాట్లో కలిపారు. మన్మోహన్ కుటుంబ సభ్యులు అంత్యక్రియలు అనంతరం గురుద్వారాలో షాబాద్ కీర్తన (గురు గ్రంథ్ సాహిబ్ సంగీత పఠనం), పాత్ (గుర్బానీ పారాయణం), ప్రార్థనలు చేశారు.