వరుడు నల్లగా ఉన్నాడని పెళ్లి రద్దు

580చూసినవారు
వరుడు నల్లగా ఉన్నాడని పెళ్లి రద్దు
యూపీలోని రాంపూర్‌లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. రాంపూర్ సమీప గ్రామానికి చెందిన యువతికి, మొహల్లా పహాడీ గేట్ ప్రాంతానికి చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. ఏప్రిల్ 26న పెళ్లి జరగాల్సి ఉంది. వరుడు ఊరేగింపుగా వధువు ఇంటికి చేరుకున్నాడు. అయితే వరుడు నల్లగా ఉన్నాడని కొందరు మహిళలు చర్చించుకున్నారు. వాటిని విన్న వధువు పెళ్లి రద్దు చేసింది. పెద్దలు సర్దిచెప్పినా ఆమె వినలేదు. దీంతో వరుడు వెనుదిరిగాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్