నాగార్జున బర్త్ డే రోజున ‘మాస్’ సినిమా రీరిలీజ్

53చూసినవారు
నాగార్జున బర్త్ డే రోజున  ‘మాస్’ సినిమా రీరిలీజ్
పాత సినిమాల రీరిలీజులతో ఆగస్టు నెలలో థియేటర్లకు జనం క్యూ కడుతున్నారు. ఇప్పటికే మహేష్ బర్త్ డే రోజు ‘మురారీ’ రీరిలీజైంది. తాజాగా నాగార్జున బర్త్ డే సందర్భంగా ‘మాస్’ను మరోసారి థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు అన్నపూర్ణ స్టూడియోస్ ప్రకటించింది. ఈనెల 28న విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తూ ‘మాస్ అంటే దుమ్ము లేచిపోవాలి’ అని ట్వీట్ చేసింది. చిరు బర్త్ డేకి ‘ఇంద్ర’, ‘శంకర్ దాదా MBBS’ కూడా రీరిలీజ్ కానున్నాయి.

సంబంధిత పోస్ట్