మద్యం మత్తులో ఉన్న ఇద్దరు తహసీల్దార్లు వీరంగం సృష్టించారు. నడిరోడ్డుపై రియల్ ఎస్టేట్ వ్యాపారిపై దాడికి దిగారు. ఈ ఘటన చిత్తూరులో జరిగింది. శివ, ప్రసన్నలు గంగవరం,పెద్దపంజాణి ఇన్‌ఛార్జ్ తహసీల్దార్లుగా పనిచేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న కృష్ణకుమార్‌పై వీరు దాడి చేశారు. ఓ బార్‌లో శివ, ప్రసన్న, కృష్ణ కుమార్‌లు వేర్వేరుగా మద్యం సేవించారు. మద్యం తాగేటపుడు మాటామాటా పెరిగి కృష్ణ కుమార్‌పై శివ, ప్రసన్న దాడి చేశారు.