టొవినో థామస్, త్రిష జంటగా నటించిన మలయాళ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'ఐడెంటిటీ' ఓటీటీలోకి వచ్చేసింది. జీ5లో ఈ మూవీ అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు మలయాళం, తమిళం, కన్నడ భాషల్లోనూ ప్రసారమవుతోంది. మలయాళంలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 24న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ వారం రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా రూ.17 కోట్ల గ్రాస్ వచ్చింది.