AP: ఫిబ్రవరి 5న రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ‘ఫీజు పోరు’ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ప్రతి జిల్లా కేంద్రంలో వైసీపీ నేతలు, విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు అందజేయనున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేయనున్నారు. కూటమి ప్రభుత్వం విద్యాదీవెన కింద రూ.2,800 కోట్లు, వసతి దీవెన కింద రూ.1,100 కోట్ల స్కాలర్‌షిప్ డబ్బులతో కలిపి మొత్తం రూ.3,900 కోట్లు బకాయిలు పెట్టిందని వైసీపీ ఆరోపిస్తోంది.