భారీ అగ్నిప్రమాదం.. 12 దుకాణాలు దగ్ధం (వీడియో)

85చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆగ్రాలోని అతిపెద్ద సింధీ మార్కెట్ టెక్స్‌టైల్ మార్కెట్‌లో మంటలు చెలరేగాయి. ఎస్‌ఎన్‌ మెడికల్‌ కాలేజీ రోడ్డులో ఉన్న ఈ షాపుల్లో మంటలు చెలరేగడంతో గందరగోళం నెలకొంది. ఈ ప్రమాదంలో 12 దుకాణాలు ఒక్కొక్కటిగా దగ్ధమయ్యాయి. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పలు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్