ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం (వీడియో)

51చూసినవారు
దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఉత్తర ఢిల్లీలోని అలీపూర్ ప్రాంతంలోని కార్నివాల్ బాంక్వెట్ హాల్‌లో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో బాంక్వెట్ హాల్ మొత్తం మంటల్లో దగ్ధమైంది. సమాచారం అందుకున్న అత్యవసర సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కనీసం 50 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్