భారీ అగ్నిప్రమాదం.. రూ.కోటి నష్టం

52చూసినవారు
భారీ అగ్నిప్రమాదం.. రూ.కోటి నష్టం
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో గురువారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కాటారం మండల కేంద్రంలోని మీనాక్షి పత్తి మిల్లులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దాదాపు 2వేల క్వింటాళ్ల పత్తి కాలిపోయినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు. సుమారు రూ.కోటి మేర నష్టం జరిగినట్లు మిల్లు యాజమాన్యం తెలిపింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్