నీట్ పేపర్ లీక్ కేసులో ప్రధాన సూత్రధారి అరెస్ట్

51చూసినవారు
నీట్ పేపర్ లీక్ కేసులో ప్రధాన సూత్రధారి అరెస్ట్
నీట్ పేపర్ లీక్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న రవి అత్రిని ఉత్తర్ ప్రదేశ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు(ఎస్టీఎఫ్) అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల నిరసన చేస్తున్న సమయంలో ఈ అరెస్ట్ చోటు చేసుకుంది. గ్రేటర్ నోయిడాలోని నీమ్కా గ్రామానికి చెందిన అత్రిపై గతంలో కూడా పలు నేరారోపణలు ఉన్నాయి. నీట్ పేపర్ లీకవడంతో ప్రతిపక్షాలు కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్