ప్రధాని మోడీకి మారిషస్ దేశం అత్యున్నత పురస్కారం ఇచ్చి గౌరవించింది. తమ దేశ అత్యున్నత పురస్కారమైన ‘‘ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్’’ ను మోడీకి ఇస్తున్నట్లు మారిషస్ ప్రధాని నవీన్‌చంద్ర రామ్‌గులాం ప్రకటించారు. ఈ గౌరవం దక్కిన తొలి భారతీయుడు మోడీనే కావడం విశేషం. మరోవైపు మారిషస్ ప్రధాని నవీన్‌చంద్ర రామ్‌గులాం, ఆయన సతీమణి వీణాలకు OCI కార్డులను మోడీ అందజేశారు.