యూపీలోని ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. 15 రోజులుగా జరుగుతున్న ఈ ఆధ్యాత్మిక వేడుకలో ఇప్పటి వరకు 15 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు. అయితే రేపు మౌనీ అమావాస్య కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో త్రివేణి సంగమం జనసంద్రంగా మారిపోయింది.