మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తున్నారు. ఇవాళ మౌని అమావాస్య పర్వదినం కావడంతో 10 కోట్ల మంది ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణీ సంగమ స్నానం చేస్తారని అంచనా. అందులో చాలామంది అయోధ్యకు వస్తారని సమాచారం. వారందరికీ బాలరాముడి దర్శన భాగ్యం కల్పించేందుకు స్థానికులు ఆలయానికి రావొద్దని ట్రస్ట్ సూచించింది. ఫిబ్రవరి తర్వాతే రావాలని కోరింది. గత 2 రోజుల్లోనే అయోధ్యకు 25 లక్షల మంది వచ్చారు. దాంతో యూపీ టెంపుల్ టూరిజం కళకళలాడుతోంది.