పుల్కల్ మండలం ముది మాణిక్యం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గణితం ఉపాధ్యాయుడు విజయ్ కుమార్ రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును గురువారం అందుకున్నారు. హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన గురుపూజోత్సవ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా అవార్డును తీసుకున్నారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ బుర్ర వెంకటేశం విజయ్ కుమార్ ను ప్రత్యేకంగా అభినందించారు.